కాంగ్రెస్‌ చీఫ్‌గా ఖర్గే..బాధ్యతలు స్వీకరణ

240
congress
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు మల్లిఖార్జునఖర్గే. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోనియా, రాహుల్ గాంధీతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, మాజీ అధ్యక్షులు, ఎంపీలు పాల్గొన్నారు. సోనియా గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఖర్గేకు ఎన్నికల్లో గెలిచిన సర్టిఫికేట్‌ను అందజేశారు. తనకు మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒక ప్రతినిధికి ఖర్గే ధన్యవాదాలు తెలిపారు.

కష్టకాలంలో పార్టీని ముందు ఉండి నడిపిన సోనియాకు ఖర్గే థ్యాంక్స్‌ తెలిపారు.ఓ కార్మికుడికి కుమారుడు, ఓ కాంగ్రెస్‌ వర్కర్‌ ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడయ్యారని, తనకు ఉన్న పనితనం, అనుభవంతో ఈ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇవికూడా చదవండి..

బిజెపికీ రాపోలు రాజీనామా..

దమ్ముంటే మళ్లీ గెలవండి…కేటీఆర్ సవాల్

చేనేత…. దేశ వారసత్వ సంపద

 

- Advertisement -