చేనేత…. దేశ వారసత్వ సంపద

232
- Advertisement -

చేనేత వస్త్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని…కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై మోడీకి లక్ష పోస్ట్ కార్డ్ ల పంపడంపై టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో మంత్రి హరీష్ రావు సూచనతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నేతన్నలు కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా 10 వేల ఉత్తరాలు మోడీకి వ్రాస్తు జీఎస్టీని ఎత్తివేయాలని నినదించారు… ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని పలు సొసైటీలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

చేనేత ఒక వ్యాపారం కాదని, దేశ వారసత్వ కళా సంపద అని సిద్దిపేట చేనేత పారిశ్రామిక సంఘం రాష్ట్ర నాయకులు బూర మల్లేశం, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చిప్ప ప్రభాకర్ అన్నారు.

భారతదేశానికి వన్నె తెచ్చిన చేనేత రంగంపై, చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేయడం బీజేపీ ప్రభుత్వానికి తగదు అన్నారు. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో చేనేత కార్మికులు 10,000పోస్ట్ కార్డులను ప్రధాని నరేంద్ర మోడీకి పోస్టు ద్వారా పంపించే కార్యక్రమం చేపట్టారు. చేనేత కళాకారులు అందరి సంతకాలతో కూడిన ఈ లెటర్లను వారం రోజుల్లో పోస్ట్ చేయనున్నారు.

గొల్లభామ చేనేత మగ్గం ప్లాంట్లు
సిద్దిపేట గొల్లభామ చేనేత మగ్గం ప్లాంట్లులో పనిచేస్తున్న కార్మికులచే సంఘం నాయకులు సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేతకు వాడే ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేయడం ద్వారా కార్మికుల పాలిట శాపంగా మారిందన్నారు.

దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి చేనేత ముడి సరుకులపై చేనేత వస్త్రాలపై ఎలాంటి పన్ను లేదని తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన జీఎస్టీ ని రద్దు చేయాలని…లేని పక్షంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తొందరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు లోక లక్ష్మీరాజ్యం, తుమ్మ గాలయ్య, ముదిగొండ శ్రీనివాస్, నరసింహ పలువురు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా 10 వేల పోస్ట్ కార్డులు

రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి లో చేనేత కార్మికులు అలమటిస్తుంటే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ వేయడం నేతన్నల నెత్తిన భారం వేసినట్టే అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేతన్నల కు చేయూత నిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చేనేత వాళ్ల చేతితో చెమటోడ్చి చేసిన కష్టాన్ని చేజారిస్తుందని ఎద్దేవా చేసారు. చేనేత వస్త్రాల పై జీఎస్టీ ఎత్తివేసే వరకు నేతన్నలకు అండగా ఉంటామన్నారు.

రాష్ట్ర జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రి మోడీకి జీఎస్టీ ఎత్తి వేయాలని లక్ష పోస్ట్ కార్డుల కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 10 వేల కార్డు లు వేస్తున్నట్లు చెప్పారు.

సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు సూచన మేరకు 10 వేల పోస్ట్ కార్డులు ప్రధాన మంత్రి మోడీ కి ఉత్తరాలు వ్రాయనున్నారు.. సిద్దిపేట , దుబ్బాక గజ్వేల్ , కోహెడ , చేర్యాల బెజ్జంకి ప్రాంతాల్లో వివిధ సొసైటీ ద్వారా మొత్తంగా 10వేలు పోస్ట్ కార్డు లు పంపిణీ చేసి త్వరలోనే మోడీ కి పంపనున్నారు..

- Advertisement -