తెలుగు రాష్ట్రాల్లో..చలి పులి

89
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. అయితే గత వారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం… బంగ్లాదేశ్‌ వైపుగా వెళ్లి టికోనా దీవి వద్ద తీరాన్ని తాటింది. దీంతో ఉత్తారదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిత్రంగ్‌ తుఫాన్‌ దక్షిణ రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో చలి తీవ్రత పెరిగిందని తెలిపింది. రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని దాంతో పాటుగా రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

అయితే తాజాగా వాతావరణ శాఖ మరో తుఫాన్‌ హెచ్చరికలు జారీ చేసింది. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడి శ్రీలంక, తమిళనాడు మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండం మారి బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో అక్టోబర్‌ 28రాత్రి నుంచి ఏపీ తెలంగాణ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడు శ్రీలంక తీర ప్రాంతం ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేశాయి.

నైఋతి ఋతుపవనాలు పూర్తి అయ్యాయని వాతావరణ శాఖ ప్రకటిస్తూ…. ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభమైనట్టు ప్రకటించింది. దీంతో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండాలు ఏర్పడుతున్నాయని…రానున్న రోజుల్లో మరిన్ని తుఫాన్‌లు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే అక్టోబర్‌28 రాత్రి తీరం దాటిన తుఫాన్‌ 29నుంచి దక్షిణ రాష్ట్రాల్లో వర్షాలకు అనుకులంగా మారుతుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌ చీఫ్‌గా ఖర్గే..బాధ్యతలు స్వీకరణ

చర్మ సౌందర్యం కోసం ఇలా ట్రై చేయండి..

మొక్కలు నాటిన ముఖాఖ్రే ప్రజలు..

- Advertisement -