టీఆర్ఎస్ లోకి నామా నాగేశ్వర్ రావు..ఖమ్మం నుంచి పోటీ

235
nama nageshwar rao
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటివలే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 8మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మారో మాజీ ఎంపీ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలో టీడీపీలో బలమైన నేతగా ఉన్న నామా నాగేశ్వర్ రావు టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. నామా నాగేశ్వర్ రావుకు ఖమ్మంలో తనకంటూ ప్రత్యేక వర్గం ఉండటంతో ఆయనపై ప్రత్యేక దృష్టి పెట్టారు గులాబీ బాస్. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వకపోవచ్చని తెలుస్తుంది. ఆయన ప్లేస్ లో మరో నేతను వెతుకుతున్నారు గులాబీ బాస్.

అయితే తాజాగా నామా సీఎం కేసీఆర్ తో భేటీ అయినట్టు తెలుస్తుంది. సమాచారం. అన్ని అంశాలపై చర్చించిన తర్వాతే నామా పేరును ఖమ్మం అభ్యర్థిగా కేసీఆర్‌ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి నామాను బరిలోకి దింపాలని గులాబీ దళపతి యోచిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు చేర్చినట్టు తెలుస్తోంది. ఇక ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు నామా నాగేశ్వర్ రావు. టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్దులను నేడు సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందో.,

- Advertisement -