నేడు ఇందూరు శంఖారావం సభకు సీఎం కేసీఆర్

258
cm kcr
- Advertisement -

నేడు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే ఈసభకు భారీ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో పాటు పరిసర జిల్లాల ముఖ్యనేతలు పెద్ద ఎత్తున హజరుకానున్నారు. కరీంనగర్ సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన కెసిఆర్ సంచలన నిర్ణయాలను వెళ్లడించింనట్లు తెలిసిందే. జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టి సారించి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిజామాబాద్ సభలో జిల్లా సమస్యలపై స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షే మ, అభివృద్ది పథకాలకు ఆకర్షితులైన తెలంగాణకు సరిహద్దు గా కలిగిఉన్న మహారాష్ట్రలోని 40 గ్రామాలు తెలంగాణలో కలుస్తామంటూ గత కొంతకాలంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిజామాబాద్‌లో జరుగుతున్న బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొనుండగా ఆయనను కలుసుకునేందుకు 40 గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు తరలివస్తున్నట్లు తెలిసిం ది. వారి కోసం వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల శంఖారావం సభలో పాల్గొననున్న సిఎం కెసిఆర్ రాత్రి నిజామాబాద్‌లోనే బస చేయనున్నట్లు సమాచారం. నిజామాబాద్ లోని ఎంపీ కల్వకుంట్ల కవిత నివాసం లో రాత్రి గడపనున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై జిల్లా నేతలతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సభా ఏర్పాట్లుకు ఎంపీ కవిత పరిశీలించారు. అయితే ఇప్పటివరకూ పార్లమెంట్ అభ్యర్దులను ప్రకటించని గులాబీ బాస్ కరీంనగర్ లో సభలో సిట్టింగ్ ఎంపీ పేరును ఖారారు చేశారు.

- Advertisement -