పాన్ ఇండియా హీరోలు..ఇదేం పని ?

95
yash
- Advertisement -

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న స్టార్ హీరోల్లో యశ్ , ఎన్టీయార్ ఒకరు. KGF ఫ్రాంచైజీ తో ఎనలేని క్రేజ్ అందుకున్నాడు యశ్. నార్త్ లో టాప్ గ్రాసర్ అందుకొని అక్కడ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. అయితే ఇంత వరకూ యష్ నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయలేదు. దీంతో అతని ఫ్యాన్స్ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. నర్తన్ డైరెక్షన్ లో యష్ సినిమా చేస్తాడనే న్యూస్ బయటికి వచ్చి చాలా రోజులైంది కానీ ఇంతవరకూ అఫిషియల్ అప్ డేట్ రాలేదు.

ఇక యన్టీఆర్ తో కూడా ఫ్యాన్స్ కి ఇదే సమస్య. RRR తో పాన్ ఇండియా స్టార్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు తారక్. కేంద్ర మంత్రి కూడా తారక్ నటన కి ఫిదా అయిపోయి డిన్నర్ కి పిలిచాడు. నెక్స్ట్ కొరటాల శివ తో సినిమా ఎనౌన్స్ అయినప్పటికీ ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు. నెలలు గడుస్తున్నా ఎన్టీయార్ షూటింగ్ మొదలు పెట్టకుండా ఫ్యాన్స్ ను అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

నిజానికి పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ హిట్స్ కొట్టాక హీరోలు స్పీడు పెంచి సినిమాలు చేయాలి కానీ ఇలా ఎనౌన్స్ మెంట్ ఇవ్వకుండా ఒకరు ఎనౌన్స్ చేసి షూటింగ్ మొదలు పెట్టకుండా ఇంకొకరు ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నారు. మరి త్వరలోనే యష్ కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్, ఎన్టీయార్ సెట్స్ లోకి అడుగుపెట్టే తరుణం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -