మిస్టర్‌ 360 సూర్య @ నెంబర్ 1

362
surya
- Advertisement -

భారత స్టార్ బ్యాట్స్‌మెన్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 1 స్ధానాన్ని నిలెబట్టుకున్నాడు. తాజాగా ఐసీసీ వెల్లడించిన టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య 859 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలిచాడు. సూర్య తర్వాత పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 836 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం 778 పాయింట్లతో మూడోస్థానానికి చేరుకున్నారు.

ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే హసరంగ (శ్రీలంక), రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్థాన్‌), రషీద్‌ (ఇంగ్లాండ్‌), హేజిల్‌వుడ్‌ (ఆస్ట్రేలియా), సామ్‌ కరన్‌ (ఇంగ్లాండ్‌) వరుసగా తొలి అయిదు స్థానాల్లో ఉన్నారు.

ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో తనదైన ఆటతీరుతో రాణించారు సూర్య. ఆరు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో అలరించాడు. గతేడాది నుండి అద్భుత ఫామ్‌తో రాణిస్తున్నారు సూర్య. ఇక ఆయన పర్సనల్ విషయానికొస్తే 2016లో దేవిషా శెట్టిని సూర్యకుమార్ యాదవ్ వివాహం చేసుకున్నాడు. దేవిషా ముంబైలో డ్యాన్స్ ట్యూటర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. సూర్యకుమార్ యాదవ్ నికర ఆస్తుల విలువ 15 కోట్లు. ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ సంవత్సరానికి సూర్యకు రూ.3.2 కోట్లు ఇస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -