వాల్తేరు కంటే వీరసింహారెడ్డికే డిమాండ్!

115
nbk vs chiru
- Advertisement -

ఈసారి సంక్రాంతి పోరు మరింత ఆసక్తికరంగా ఉండనుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి రేసులో పోటీపడనున్నాయి. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఎవరు పైచేయి సాధిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఆచార్యపై అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇద్దరి హీరోల ఫ్యాన్స్‌ కూడా సంక్రాంతి మొనగాడు ఎవరోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీస్ నిర్మిస్తోండగా చాలాచోట్ల రెండు సినిమాల రైట్స్ కలిపి అమ్ముతున్నారు. నైజాంలో ఈ రెండు సినిమాల రైట్స్ రు. 35 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లుగా డిసైడ్ చేయగా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఒప్పుకోవడం లేదు.

సీడెడ్ వ‌ర‌కు బాల‌య్య సినిమా విడిగా ఇవ్వాల‌ని… అలా అయితేనే తాము మంచి రేటు ఇచ్చి తీసుకుంటామ‌ని చెబుతున్నారట. ఎందుకంటే చిరు నటించిన గత సినిమాలు ఆచార్య, గాడ్‌ ఫాదర్‌ సీడెడ్‌లో సత్తాచాటలేకపోయాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్స్‌ అంతా వీరసింహారెడ్డి వైపే మొగ్గుచూపతున్నారట. ఏకంగా రు. 15 కోట్ల‌కు త‌గ్గ‌కుండా పెట్టేందుకు రెడీగా ఉన్నారని టాక్‌. మరి ఈసారి సంక్రాంతి రేసులో వీరసింహారెడ్డిపై పైచేయి సాధించి చిరు సీడెడ్ మొనగాడుగా నిలుస్తాడా లేదా వేచిచూడాలి..

ఇవి కూడా చదవండి..

- Advertisement -