పేకాటలో బాలయ్య ఎంతపోగొట్టుకున్నాడో తెలుసా?

181
nbk
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి పేకాట ఏం కొత్తకాదు. సినిమా షూటింగ్ సమయంలో ఏ మాత్రం గ్యాప్ దొరికాన ముక్కలు పడాల్సిందే. ఇదే విషయాన్ని ఎంతోమంది నటులు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. తాజాగా దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి..బాలకృష్ణ పేకాట ఆడతారని ఈ సందర్భంగా ఎంత పొగొట్టుకున్నారో తెలిపారు.

టాప్ హీరో సినిమా షూట్ సమయంలో బాలయ్య గారు పేకాట వచ్చా అని నన్ను అడిగారని…వచ్చు అనగానే ఇద్దరం కలిసి ఆడామని తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య పది రూపాయలు పొగొట్టుకున్నారని.. ఆ తర్వాత నేను వెళ్లిపోతాను అని చెప్పినా వినలేదని ఆడాల్సిందేనని చెప్పారని గుర్తుచేశారు. ఆ ఇన్సిడెంట్ ఫన్నీ ఇన్సిడెంట్ అని తెలిపారు.

నందమూరి బాలకృష్ణ వయస్సు ప్రస్తుతం 62 సంవత్సరాలు. అగ్రహీరో అయినా అందరితో సరదాగా ఉంటారు. ఇక ఆహా వేదికగా వస్తున్న అన్‌స్టాపబుల్‌తో ఆడియన్స్‌కు మరింతగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఆయనతో నటించిన దర్శకులు, హీరోయిన్లు సైతం మళ్లీమళ్లీ ఆయనతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -