వామ్మో బాలయ్య.. ఇన్ని ఫైట్లా ?

145
- Advertisement -

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య వీరసింహా రెడ్డి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాకు సంబందించి శరవేగంగా జరుగుతుంది. డిసెంబర్ కల్లా టోటల్ షూట్ కంప్లీట్ చేయాలనే నిర్ణయం తో యూనిట్ పనిచేస్తోంది. అయితే ఇప్పటికే యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ పూర్తయింది. ఇంకొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బ్యాలెన్స్ ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ ఇంకా షూట్ జరగలేదని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇన్సైడ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా ఫైట్స్ ఉన్నాయని తెలుస్తుంది. చిన్నా చితకా అన్ని కలిసి 11 వరకు ఉంటాయని టాక్. బాలయ్య ప్రీవియస్ మూవీ అఖండ యాక్షన్ ఎపిసోడ్స్ తో థియేటర్ లో పూనకాలు తెప్పించి బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించింది. ఇక గోపీచంద్ మలినేని ముందు సినిమా క్రాక్ కూడా యాక్షన్ కంటెంట్ తో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మరి వీరిద్దరి కాంబో సినిమా అంటే ఫ్యాన్స్ చాలా యాక్షన్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఇప్పటికే టీజర్ తో సినిమా ఎంత మాస్ గా ఉండబోతుందో చెప్పేశారు.

మరి బాలయ్య వీర సింహా రెడ్డి లో ఫైట్స్ తో మాస్ ప్రేక్షకులకు మరో సారి పూనకం తెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. మైత్రి movie మేకర్స్ బేనర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -