కేజీఎప్‌ సీక్వెల్‌లో మున్నాభాయ్‌..!

165
kgf

కన్నడ హీరో యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్‌. ఏఏ ఫిలింస్ – ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకువచ్చింది. త్రిభాష చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టింది.

వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించగా తెలుగు రాష్ట్రాల్లో సైతం దాదాపుగా రూ. 10 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఒక్క హిందీలోనే ఈ చిత్రం ఏకంగా రూ.40 కోట్ల మేరకు వసూలు సాధించింది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది.

తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేశారు. ప్రధానపాత్రల్లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌ని తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. ఇక మొదటిభాగంలో చేసిన రవిశంకర్ .. అదే పాత్రలో రెండవ భాగంలోను కొనసాగుతాడట. మ‌రి సీక్వెల్‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో వేచిచూడాలి.