గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న కేసముద్రం ఎంపీపీ..

292
Kesamudram MPP
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఎంపీపీ ఓలం చంద్రమోహన్ మొక్కలు నాటారు. ఆయనతో పాటు కేసముద్రం మండల ప్రజాపరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ రోజా రాణి మరియు మహబూబాబాద్ జిల్లా జెడ్పీ సీఈవో సన్యాసాయ మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు పోతుందని కొనియాడారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువకులు పాల్గొని ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి వాటిని ఎదిగేవరకు బాధ్యత తీసుకోవాలి అని కోరారు.ఈరోజు జన్మదిన కార్యక్రమం జరుపుకుంటున్న కేసముద్రం ఎంపీపీ ఓలం చంద్రమోహన్ కి స్థానికులు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -