ఈ బిచ్చగాడికి సలామ్‌ కొట్టాల్సిందే..!

233
Kerala Floods
- Advertisement -

అతను బిచ్చగాడే..కానీ ఆయన ఆలోచన ఎంతో మందికి స్పూర్తినిచ్చేదిగా ఉంది. ఆయన ఆలోచనకి అందరూ సలామ్‌ కొట్టాల్సిందే. ఓ బిచ్చగాడికి సలామ్ కొట్టడమేంటని అనుకోకండి…మనం సలామ్ కొట్టాల్సింది ఆయకి కాదు..ఆయన ఆలోచనకి. అవును…పొట్టకూటికోసం..రోజూ రోడ్ల మీద అడుక్కునే బిచ్చగాళ్ళని మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ…ఆ పని చేయగా వచ్చిన డబ్బుతో ఓ రాష్ట్రాన్ని ఆదుకోవాలనే మనసున్న బిచ్చగాళ్ళని చాలా అరుదుగా చూస్తుంటాము.

Kerala Floods

ఇటీవల కేరళకు వరదలు పోటెత్తడంతో కేరళ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చాలా మంది తమకు తోచిన సాయాన్ని అందించారు. అయితే ఆ రాష్ట్రానికే చెందిన ఓ బిచ్చగాడు తన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. తాను పోగుచేసుకున్న రూ.94 లను కేరళకు విరాళంగా ఇచ్చి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.

వివరాల్లోకివెళితే..మోహనన్‌ అనే వృద్దుడికి ఇల్లు లేదు. కొట్టాయయంలోని పూన్జర్‌ప్రాంతానికి చెందిన ఆయన బిచ్చమెత్తుకుంటూ బతుకీడుస్తున్నాడు. కేరళకు భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆయనకూడా ఇబ్బందులు పడ్డాడు.

Kerala Floods

కాగా..కేరళను ఆదుకునేందుకు తాను సేకరించి మొత్తాన్ని 94 రూపాయలను విరాళంగా ఇవ్వాలనుకొని..ఎర్రట్టుపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్‌ ‌రషీద్ నివాసానికి వెళ్లి గేటు వద్ద కూర్చున్నాడు. అతన్ని చూసిన రషీద్‌ బిచ్చం కోసం వచ్చాడనుకుని రూ.20 ఇచ్చారు. కానీ, అతను ఆ డబ్బు వద్దని చెప్పి తాను పోగుచేసిన రూ.94 ఇచ్చాడు. ఇదేంటని అడిగితే.. ‘కేరళకు నా వంతు సాయం చేయాలనుకుంటున్నాను. నా తరఫున మీరే ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ డబ్బును పంపించండి’ అని అడిగాడు. అంతే..అతని మాట విని షాక్‌ అయిన రషీద్‌ నోటి వెంట మరో మాట రాలేదు. ఈ విషయాన్ని రషీద్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడిస్తూ.. ‘అతనికున్న మంచి మనసును చూసి సంతోషించడం తప్ప నేను ఏమీ చేయలేకపోయాను.‌’ అని వెల్లడించారు రషీద్‌. నిజంగా..ఆ బిచ్చగాడి ఆలోచన ఎంతో మందికి స్పూర్తినిచ్చేదిగా ఉంది కదూ..!

- Advertisement -