సాంగ్ తో పాటు..సాయం కూడా..

221
- Advertisement -

గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలు కేరళలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వరదలతో ఉక్కిరిబిక్కిరైన కేరళకు విరాళాలు ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, సాధారణ ప్రజలుసైతం ముందుకొచ్చి విరాళాలు అందజేశారు.

AR Rahman Pledges Rs. 1 Croreఅయితే ఇప్పుడిప్పుడే వరదల తాకిడి నుంచి తగ్గుముఖం పట్టిన కేరళకి తాజాగా టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌. రెహమాన్‌ కూడా కేరళకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తమ బృందంతో కలిసి కోటి రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చినట్లు ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు రెహమాన్‌.

రెహమాన్‌ ఆదివారం తన బృందంతో కలిసి అమెరికాలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళకు సాయం అందిస్తున్న విషయాన్ని వేదికపై ప్రకటించారు. ‘నేను, నా ఆర్టిస్టులు అమెరికా టూర్‌లో పాల్గొన్నాం. కేరళ సోదర సోదరీమణుల కోసం మా వంతు సాయం చేశాం. ఈ చిన్న విరాళం మీకు కాస్త ఊరట‌ ఇస్తుందని ఆశిస్తున్నాం’ అని రెహమాన్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా చెక్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

కాగా ఇప్పటికే ఈ టూర్‌లో భాగంగా కేరళ వరద బాధితులను ఉద్దేశించి ‘కేరళ, కేరళ, డోన్ట్‌ వర్రీ కేరళ’ అంటూ పాట పాడిన విషయం తెలిసిందే. ఆ పాటకి రెస్పాస్స్‌ కూడా అదిరిపోయింది.

- Advertisement -