TELANGANA:కేంద్రం ప్రకటించే అవార్డులన్ని తెలంగాణకే: హరీశ్‌

39
- Advertisement -

కేంద్రప్రభుత్వం ఏ అవార్డు ప్రకటించిన అందులో తెలంగాణ మొదటి స్థానంలో నిలబడుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. 2021-2022సంవత్సరానికిగాను జాతీయ పంచాయితీ అవార్డు(2023) దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయితీ సతత్‌ వికాస్‌ పురస్కారాలను దక్కించింది. మొత్తం 27విభాగాల్లో ఈ అవార్డులు ప్రధానం చేయగా వాటిలో ఎనిమిదింటిలో తెలంగాణ పల్లెలు నిలిచాయి. ఆ తర్వాత కేరళ నాలుగు విభాగాలతో రెండవ స్థానంలో ఉంది.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరింత ముందుకు వెళ్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పంచాయితీ రాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

  1. ఉత్తమ ఆరోగ్య విభాగంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గౌతమ్ పూర్ గ్రామ పంచాయితీ మొదటి స్థానంలో నిలిచింది.
  2. తగినంత నీరు కల్పించడంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన ఏకైక గ్రామంగా జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామ పంచాయితీ మొదటి స్థానంలో ఉంది.
  3. అలాగే సామాజిక భద్రత విభాగంలో మహబూబ్ నగర్‌ జిల్లాలోని కొంగట్‌ పల్లికి మొదటి స్థానం వరించింది.
  4. మహిళా రక్షణలో కూడా మహిళా స్నేహపూర్వక విభాగంలో సూర్యాపేట జిల్లాలోని ఐపూర్‌కు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
  5. భారతదేశ ప్రధాన లక్ష్యాల్లో ఒకటైన పేదరిక నిర్మూలన…పేదరికం లేని మెరుగైన జీవనోపాధి పంచాయితీ విభాగంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మండొడ్డి గ్రామానికి రెండవ స్థానంలో నిలిచింది.
  6. సరైన సుపరిపాలన అందించడంలో భాగంగా పంచాయితీ విత్ గుడ్‌ గవర్నెస్‌ విభాగంలో వికారాబాద్‌ జిల్లా చీమల్దారి గ్రామ పంచాయితికి రెండో స్థానంలో నిలిచింది.
  7. పెద్దపలి జిల్లాలోని సుల్తాన్పూరి గ్రామంకు పచ్చదనం పరిశుభ్రత విభాగంలో మూడో స్థానంలో నిలిచింది.
  8. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట గ్రామ పంచాయితీకి స్వయం సమృద్ధి మౌలిక సదపాయల కల్పనలో ఈ గ్రామంకు మూడో స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి….

బొగ్గు బ్లాకుల వేలం..బీఆర్ఎస్ మహాధర్నా

Komatireddy: పార్టీ మార్పుపై క్లారిటీ

సొంతంగా వ్యాక్సిన్లు కొనుకోండి: కేంద్రం.!

- Advertisement -