ఇంటింటికీ తాగునీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమన్న సవాల్‌కు కట్టుబడి ఉన్నామన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికలకంటే.. నాలుగు నెలల ముందే మిషన్ భగీరథను పూర్తి చేసి ఇంటింటికీ నీళ్ళు అందించనున్నట్టు సీఎం తెలిపారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన సీఎం ..నిన్నటి కలెక్టర్ల సమావేశంలో మిషన్ భగీరథపై చర్యకు కోనసాగింపుగా నేడు కూడా సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో ప్రధాన గ్రిడ్ పనులు 95 శాతం పూర్తి అయినట్లు అధికారులు కేసీఆర్‌కు వెల్లడించారు. మొత్తం ప్రాజెక్ట్‌ల్లో 75 శాతం పనులు పూర్తయినట్లు సీఎంకు అధికారులు తెలుపగా.. గ్రామాల్లో అంతర్గత పైప్ లైన్ల నిర్మాణం, నల్లాలు ఏర్పాటు పనులపై సీఎం ఆరా తీశారు.
ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే మిషన్ భగీరథ పనులు పూర్తి చెయ్యాలని అన్నారు. ఫోరైడ్, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీఎం అధికారులను అదేశించారు.