బహుగుణ మృతి పర్యావరణ రంగానికి తీరని లోటు- సీఎం కేసీఆర్

38
kcr

చెట్ల నరికి వేతను వ్యతిరేకిస్తూ చిప్కో ఉద్యమాన్ని (చెట్లను కౌగిలించు కోవడం) నడిపిన, ప్రముఖ పర్యావరణ వాది, సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలపై, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణ కోసం జీవితాంతం కృషి చేస్తూ, తన జీవితాంతం పరితపించిన బహుగుణ మరణం ప్రకృతి, జీవావరణ పర్యావరణ రంగానికి తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. బహుగుణ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.