అమ్మకు ఆత్మీయతతో…కేసీఆర్ కిట్

510
KCR kits to be distributed today
- Advertisement -

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లీ బిడ్డలకు రక్షణ కల్పించడం లక్ష్యంగా  ప్రభుత్వం తీసుకురాబోతున్న ‘కేసీఆర్‌ కిట్‌’ల పథకం శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది.  సీఎం కేసీఆర్‌ ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో ప్రారంభించనున్నారు. కేసీఆర్‌ కిట్‌లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేయించుకున్న మహిళకు రూ.12 వేల నగదును (ఆడపిల్లకు జన్మనిస్తే రూ.13 వేలు), తల్లీ బిడ్డల రక్షణకుగాను ప్రత్యేక వస్తువుల కిట్‌ను అందించనున్నారు.

రాష్ట్రంలో 841 హాస్పిటల్లో ఇవాళ్టి నుంచి కేసీఆర్ కిట్ల పంపిణి ప్రారంభమవుతుంది. రూ. 12 వేలతో పాటు అమ్మాయి పుడితే అదనంగ వెయ్యి ఇస్తారు. ఆ పైసల్ని నాలుగు విడతలల్లో బాలింతల బ్యాంకు ఖాతాలల్లో జమ చేస్తుంది సర్కార్. వీటితో  పాటు 2 వేల విలువ చేసే కిట్లను కూడా ఇస్తారు. ఇందులో బేబీ సోప్, బేబీ ఆయిల్, బేబీ పౌడర్, రెండు బేబీ డ్రస్సులు, టవల్స్, దోమతెర, తల్లికి రెండు చీరలు అన్నీ కలిపి… 16 వస్తువులుంటాయి. . రాష్ట్రంలో ఏటా 6 లక్షల 28 వేలకు పైన కాన్పులవుతున్నాయి. ఇందులో 30 నుంచి 40 శాతమే ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్ల పథకంతో వీటిని కనీసం 50 శాతానికి పెంచాలన్నది సర్కార్ లక్ష్యం.  ఈ పథకం అమలుకు ఈ ఏడాదిలో 443కోట్ల 63లక్షల రూపాయల కేటాయించింది. ఇప్పటికే కిట్లను రెడీ చేసి అన్ని జిల్లాలకు పంపించింది వైద్య ఆరోగ్యశాఖ.

KCR kits to be distributed today
అర్హతలు.. :

() ఆధార్  కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పనిసరి

() మొబైల్ నంబర్

()మాతా శిశుసంరక్షణ కార్డు

()రెండు కాన్పుల వరకే ఆర్థికసాయం

() ఒకవేళ మొదటి కాన్పులో కవలలైతే ఒకసారే ఆర్థికసాయం చేస్తారు.

()కవలలిద్దరికీ రెండు కిట్లు అందజేస్తారు.

KCR kits to be distributed today

విధివిధానాలు:

() కనీసం రెండు పరీక్షలు చేయించుకున్న తర్వాత మొదటిసారి మూడువేలిస్తారు.

()రెండోసారి ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవం అయినప్పుడు 4 వేలిస్తారు.

()అప్పుడే తల్లీబిడ్డలకు 16రకాల వస్తువులతో కేసీఆర్  కిట్ ను అందిస్తారు.

()ఇక మూడోసారి శిశువుకు పెంటావాలెంట్, ఓపీవీ డోసులు వేయించినప్పుడు ఇంకో 2 వేలిస్తారు.

() నాల్గోపారి బిడ్డకు 9నెలలు వచ్చినప్పుడు మీజిల్స్  వ్యాక్సిన్  వేసినప్పుడు మళ్లో 3వేలిస్తారు.

- Advertisement -