బంగారు తెలంగాణే ధ్యేయంగా పని చేస్తాం …

236
- Advertisement -

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ  వేడుకలు ఘనంగా నిర్వహించారు.లండన్ లోని టాక్ కేంద్ర కార్యాలయం లో కార్యవర్గ కుటుంబసభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్  చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

టాక్ వ్యవస్థాపకుడు మరియు ఎన్నారై టి.ఆర్.యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలుపుతూ….. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో బాగస్వాములైనందుకు గర్వాంగా ఉందని, అలాగే రాష్ట్ర ఏర్పాటును కూడా చూసే అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన కెసిఆర్ గారు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని, బంగారు తెలంగాణ కేవలం కెసిఆర్ గారి వల్లే సాధ్యమని, ఎలాగైతే ఉద్యమం లో వారి వెంట ఉన్నామో, బంగారు తెలంగాణ నిర్మాణం లో కూడా  వారి వెంట ఉండి మా వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు.

Talk for Telangana formation day celebrations
టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ, మొట్టమొదటి సారి టాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలు జూన్ రెండు నాడే జరుపుకోవడం సంతోషంగా ఉందని, మేమంతా కేవలం నేడు సంబరాలకు పరిమితం కాకుండా, నాడు తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నామని, ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. సేవే లక్ష్యం – బంగారు తెలంగాణే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న మేము, తెలంగాణ సమాజానికి మా వంతు బాధ్యతగా సేవ చేస్తామని, బంగారు తెలంగాణ లో బాగస్వాములమవుతామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు.

ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణని, బంగారు తెలంగాణగా నిర్మించుకునే బాధ్యత అందరి పైన ఉందని ప్రతి ఒక్కరు వారి శక్తికి తగ్గట్టుగా బాగస్వాములవ్వాలని కోరారు. టాక్ ముఖ్య నాయకులు మట్టా రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు.

టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర కంది, కార్యవర్గ సభ్యులు  మత్తా రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, విజయలక్ష్మి, సుమా దేవి, మధుసూదన్ రెడ్డి, రత్నాకర్, అశోక్, నవీన్, విక్రమ్, సత్య, శైలజ, వెంకట్ రెడ్డి, రవి రైతినేని, సత్యం కంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -