రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాల సంఖ్య: ఈటల

164
etela
- Advertisement -

కేసీఆర్ కిట్‌తో రాష్ట్రంలో శిశు మరణాల సంఖ్య తగ్గిందని…తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్‌. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేసీఆర్ కిట్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఈటల…కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు.

కేసీఆర్ కిట్ ప‌థ‌కం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 11,91,275 మంది కుటుంబాలు ల‌బ్ధి పొందారని…గ‌ర్భిణి ఆరోగ్య ప‌రిస్థితిని బ‌ట్టి ఆయా ఆస్ప‌త్రుల‌కు పంపి డెలివ‌రీలు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. గ‌ర్భిణిల ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ఆశా వ‌ర్క‌ర్లు ప‌రిశీలిస్తున్నార‌ని చెప్పారు.

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రోగుల అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో పాటు మౌలిక వ‌స‌తులు క‌ల్పించామ‌న్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను క్ర‌మ‌క్ర‌మంగా బలోపేతం చేస్తున్నామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. అవ‌స‌ర‌మైన చోట అద‌న‌పు డాక్ట‌ర్లు, సిబ్బంద‌ని నియ‌మిస్తున్నామ‌ని తెలిపారు.

- Advertisement -