సీఎం కేసీఆర్‌ సోషల్ ఇంజనీర్:హరీష్‌

215
Harish Rao
- Advertisement -

సీఎం కేసీఆర్‌కు వ్యవసాయంపై మంచి అవగాహన ఉందని…ఆయన సోషల్ ఇంజనీర్ అన్నారు మంత్రి హరీష్ రావు. ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టుల్లో సాగునీటి నిర్వహణపై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో మాట్లాడిన హరీష్‌ ఇంజనీర్లు,నీటి పారుదల అధికారులు మంచి పనీతురు కనబరుస్తున్నారని ప్రశంసలు గుప్పించారు.

నాలుగేళ్ల సమిష్టి కృషితో సాగునీటి రంగంలో అద్భుత ఫలితాలు సాధించామన్నారు హరీష్. ఆన్, ఆఫ్ పద్ధతిలో నీటి విడుదలతో పంట దిగుబడి పెరిగినట్టు రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టుల కింద చుక్కనీరు వృథా కాకుండా చూస్తున్నామని… చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

మిషన్ కాకతీయ అద్భుతమైన పథకమని చెప్పిన హరీష్‌… దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా 12 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశామని… భూగర్బజలాలు కూడా పెరిగాయన్నారు.

సాగర్ ద్వారా ఒక్కొక్క టీఎంసీకి 11వేల 796 ఎకరాలు పారిస్తున్నామని… అధికారుల సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. మహిళా ఇంజినీర్లు కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఎస్‌కే జోషీ, నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు చెందిన ఇంజినీర్లు పాల్గొన్నారు.

- Advertisement -