హస్తినలో సీఎం కేసీఆర్

194
KCR Delhi Tour details
- Advertisement -

రెండు రోజుల పర్యటన  నిమిత్తం సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెళ్లారు. మంగళవారం జరిగే రాష్ట్రపతి ప్రమాణస్వీకారోత్సవంలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పర్యటనలో ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించి, రాష్ట్రపతిగా రిటైర్‌ కానున్న ప్రణబ్‌ ముఖర్జీని కలుసుకొని, ధన్యవాదాలు తెలుపుతారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీని కలిసి తెలంగాణ సచివాలయ నిర్మాణానికి బైసన్‌ పోలో గ్రౌండ్‌ను యుద్ధ ప్రాతిపదికన అప్పగించాలని కోరనున్నారు.

అలాగే రాష్ట్ర విభజన సమస్యలతోపాటు రాష్ట్రానికి చెందిన కీలకమైన అంశాలపై వారితో చర్చించే అవశాశం ఉన్నది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద రాష్ట్రంలో 11 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ఈ పథకంలో శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టు ఉన్నది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా కింద ఖర్చు చేయాల్సిన రూ.4,950 కోట్ల నిధులను నాబార్డు ద్వారా త్వరగా ఇప్పించాలని జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని సీఎం కోరే అవకాశం ఉంది.

వెనుకబడిన జిల్లాలకు పాత జిల్లాల ప్రకారం ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున 9 జిల్లాలకు రూ.450 కోట్లు మూడో విడుత నిధులు రావాల్సి ఉన్నా ఇంతవరకు విడుదల కాలేదు. వీటిని త్వరగా విడుదల చేయాలని కోరనున్నట్టు సమాచారం. జీఎస్టీలో చిన్న గ్రానైట్ పరిశ్రమలపై 28 శాతం పన్ను విధించడం ద్వారా ఈ పరిశ్రమ దెబ్బతిని ఐదు లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని, దీనిని దృష్టిలో పెట్టుకొని 5 శాతం పన్నుకు పరిమితం చేయాలని కోరనున్నట్టు సమాచారం. ఈ నెల 26న తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.

- Advertisement -