సిక్స్‌ ప్యాక్‌తో అదరగొట్టిన….. బాలకృష్ణుడు

187
Nara Rohith Balakrishnudu First Look
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. వరుస సినిమా విజయాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ యువ హీరో శమంతకమణి విజయంతో బాలకృష్ణుడుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

నారా రోహిత్ పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదలచేశారు యూనిట్ సభ్యులు. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నార్వే లో పాటల షూటింగ్ జరుగుతోంది. దాదాపుగా షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈచిత్రం సెప్టెంబర్ లో విడుదల కాబోతుంది.

Nara Rohith Balakrishnudu First Look

సిక్స్ పాక్స్ బాడీతో తన కెరీర్లోనే మొదటిసారి నారా రోహిత్ వెండితెరపై దర్శనమిస్తున్నాడు. రెజీనా హీరోయిన్‌గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. నరసింహ సినిమాలో నీలాంబరి, బాహుబలి సినిమాలో శివగామి తరహాలో ఎంతో కమాండ్ ఉన్న పాత్ర రమ్యకృష్ణ చేస్తోంది.

కెరీర్‌లో నారా రోహిత్‌కు ఈ సినిమా 15వ చిత్రం. ఈ సినిమా కోసం రోహిత్ ఏకంగా 25 కేజీల బరువు తగ్గాడు.  గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్త గెటప్ కనిపించి అభిమానులకు పండుగ చేశాడు. పొడగాటి జుట్టు, సిక్స్‌ప్యాక్‌తో స్పెషల్‌గా కనిపించడం ఫస్ట్‌లుక్‌లో విశేషం.దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.

- Advertisement -