మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమోదించండి:కవిత

254
mp kavitha
- Advertisement -

అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లును అమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును సైతం అంతేత్వరగా అమోదించాలని అభిప్రాయపడింది ఎంపీ కవిత.

ఈబీసీ బిల్లును ఎంత వేగంగా పాస్ చేశారో అంతే స్పీడ్‌తో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదిస్తే దేశం నిజంగానే ప్రగ‌తి సాధిస్తుంద‌ని కవిత ట్వీట్ చేసింది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు పార్ల‌మెంట్‌లో ఆమోదం ద‌క్కాలంటే, దానికి బ‌ల‌మైన రాజ‌కీయ సంక‌ల్పం ఉండాల‌ని తెలిపారు.

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో గ‌తంలో పార్ల‌మెంట్ లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఈ బిల్లు రాజ్య‌స‌భ‌లో ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

- Advertisement -