అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాం!

107
katrina
- Advertisement -

గతేడాది డిసెంబర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌, యువ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో చాలా తక్కువ మంది మధ్యలో ఘనంగా జరిగింది.

ఆ తర్వాత కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి తమ పెళ్లి జరిగిందని అభిమానులకి, ప్రేక్షకులకి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తాజాగా ముంబైలో 67వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమానికి భర్త విక్కీ కౌశల్ తో కలిసి వచ్చి సందడి చేసింది కత్రినా.

తొలిసారి తన పెళ్లి గురించి మాట్లాడుతూ…కరోనా సమయంలో నా ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. మా ఫ్యామిలిలో అందరం కరోనా బారిన పడ్డాము. వారి విషయంలో నేను మళ్ళీ రిస్క్ చేయదలుచుకోలేదు. అందుకే ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే మా పెళ్లిని చాలా సీక్రెట్ గా చేసుకున్నాం అని తెలిపారు. సింపుల్ గా జరిగినా చాలా బాగా జరిగింది. మా పెళ్లిని సీక్రెట్ గా చేసుకోవడానికి కరోనా భయమే కారణం అని తెలిపింది.

- Advertisement -