- Advertisement -
స్వర్ణ దేవాలయంలో రష్మిక మందన్న ప్రత్యేక పూజలు చేశారు. విక్కీ కౌశల్‌తో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు రష్మిక. ఫిబ్రవరి 14న ‘ఛావా’ చిత్రం విడుదల నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
గోల్డెన్ టెంపుల్ లో భక్తి శ్రద్దలతో కనిపించిన వీరిద్దరు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విక్కీ తెల్ల చికెన్ కుర్తాలో, రష్మిక పింక్ సూట్ లో కనిపించారు.
ఛావా..ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శంభాజీ భార్య ఏసు బాయి పాత్రలో రష్మిక నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న సినిమా రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read:మోడీ అధ్యక్షతన AI సమావేశం
- Advertisement -

