బీఆర్ఎస్‌లో చేరిన కత్తి కార్తీక

74
- Advertisement -

తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలో కత్తి కార్తీక చేరగా ఆమెకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీష్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అబద్ధాలకు వ్యాప్తి ఎక్కువ… నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గాలి వీస్తుందన్నారు. ఆరు గ్యారెంటీలు ఏమో గానీ, వాళ్ళు అధికారం లోకి వస్తె ఆరు నెలలకు ఒక సీఎం అవుతారని ఎద్దేవా చేశారు.

అన్నీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరాలి, కేసీఆర్ మూడో సారి సీఎం కావాలన్నారు హరీష్. కాంగ్రెస్ వస్తె కరువు వస్తుంది, కర్ఫ్యూ వస్తుంది. వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నారు.కాంగ్రెస్ అంటేనే నాటకం. కర్ణాటక లో ఆరు గ్యారెంటీలు అని ప్రజల్ని మోసం చేశారన్నారు.ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టా ఇచ్చి, ఓనర్లు చేస్తం అన్నది కేసీఆర్ అని…ఇంటింటికీ సన్నబియ్యం ఇవ్వబోతున్నాము…. ప్రతి ఇంటికి అర్థం అయ్యేలా చెప్పాలన్నారు.

Also Read:BRS:కేంద్రంలో బి‌ఆర్‌ఎస్ సత్తా..నో డౌట్!

- Advertisement -