ఏప్రిల్ 27న జరగబోయే BRS రజతోత్సవ సభలో పాల్గొనడానికి సిద్దిపేట నియోజకవర్గ కేంద్రం రంగదాం పల్లి అమరవీరుల స్థూపం నుండి వరంగల్ సభ వరకు విద్యార్థి, యువత పాదయాత్ర ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
పహల్గంలో ఉగ్రమూక దాడిలో మరణించిన వారికి నివాళ్లు అర్పించి.. జెండా ఊపి పాదయాత్ర ను ప్రారంభించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. 25 ఏళ్ల బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా కదం కదం తొక్కుతూ వరంగల్లు సభకు యువత కదలింది.
పురిటిగడ్డ సిద్దిపేటలో 25 మీటర్ల గులాబీ జెండా ప్రదర్శన చేపట్టారు. బిఆర్ఎస్ రజతోత్సవం..తెలంగాణ ప్రజల విజయోత్సవం అన్నారు మాజీ మంత్రి హరీష్. నాడు లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి రామ దండు కదిలింది… నేడు రేవంతు అరాచకాలు ఎదిరించడానికి గులాబీ దండు కదిలింది అని తెలిపారు.
Also Read:తెలంగాణ పది ఫలితాల డేట్ ఫిక్స్
25 ఏళ్ల బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భం..
కదం కదం తొక్కుతూ వరంగల్లు సభకు యువత పాదయాత్ర
పురిటిగడ్డ సిద్దిపేటలో 25 మీటర్ల గులాబీ జెండా ప్రదర్శన
బిఆర్ఎస్ రజతోత్సవం..
తెలంగాణ ప్రజల విజయోత్సవం..నాడు లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి రామ దండు కదిలింది.
నేడు రేవంతు అరాచకాలు… pic.twitter.com/992ivQHkcz
— Harish Rao Thanneeru (@BRSHarish) April 25, 2025

