- Advertisement -
ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఒక యువకుడు ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న ఘటన జరిగి నెలరోజులు గడవక ముందే మరో ఘటన జరిగింది.
జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన రంభబాయి-బాద్రుషావ్ దంపతుల రెండో కుమారుడు ఆత్రం చత్రుషావ్.. అదే గ్రామానికి చెందిన యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
కెరమెరి మండలం సాంగి గ్రామానికి చెందిన బంధువైన మరో యువతిని సైతం ఏడాదిగాప్రేమించాడు యువకుడు. 15 రోజుల క్రితం ఆమెతో పెళ్లి చూపులు జరిగాయి.రెండో యువతి ఒప్పుకోవడంతో ఇద్దరిని కలిపి పెళ్లి చేశారు రెండు కుటుంబాల పెద్దలు. ఇందుకు సంబంధించిన న్యూస్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read:మహిళల భద్రత కోసం ‘ట్యూటెమ్’ యాప్
- Advertisement -

