సిద్దిపేటలో ఉచిత క్యాన్సర్ పరీక్ష, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇతర దేశాల కంటే మన దేశంలోనే క్యాన్సర్ విస్తృతి ఎక్కువగా ఉందని… ప్రతి పది మంది పేషంట్లను పరీక్షిస్తే, ఇద్దరు ముగ్గురికి క్యాన్సర్ ఉంటుందన్నారు.
వైద్యరంగంలో మనం ఎన్నో విజయాలు సాధించినప్పటికీ, క్యాన్సర్ ను మాత్రం పూర్తిగా జయించలేకపోయాం..- క్యాన్సర్ వ్యాధి పేషంట్లతోపాటు, అటెండెంట్లను కూడా బాధపెడుతుంటుంది. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుంది అన్నారు. క్యాన్సర్ ను ఎర్లీ స్క్రీనింగ్ తో గుర్తిస్తే తొలిదశలోనే నివారించవచ్చు అన్నారు.
Also Read:చర్మసమస్యలా.. అయితే మీకోసమే!
అందుకే మధ్యవయస్సు వచ్చిన వారందరూ తప్పనిసరిగా తరచూ పరీక్షలు చేయించుకొన్నట్లయితే, ముందస్తుగానే వ్యాధులను గుర్తించి కాపాడుకోవచ్చు…. ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి క్యాన్సర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసం నా వంతుగా సహకరిస్తాను అన్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా ముందుకు వచ్చి ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించాలి అన్నారు.

