BRS:కేంద్రంలో బి‌ఆర్‌ఎస్ సత్తా..నో డౌట్!

27
- Advertisement -

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతుంటే.. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలపై కూడా ఇప్పటి నుంచే క్యూరియాసిటీ నెలకొంది. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని గద్దె దించి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించేంచేందుకు అడుగులు పడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ మద్యనే అధికారం చేతులు మారుతూ వస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా తోడు దొంగల్లా దేశాన్ని దోచుకుంటూ నియంత పాలన సాగిస్తూ వస్తున్నాయి. దాంతో ఈ రెండు పార్టీల పాలనకు చెక్ పెట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహారాష్ట, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు బి‌ఆర్‌ఎస్ విస్తరించింది. .

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల దృష్టి రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన అధినేత కే‌సి‌ఆర్.. ఎలక్షన్స్ తరువాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టె అవకాశం ఉంది. తాజాగా జాతీయ రాజకీయాలపై బోథ్ సభలో కే‌సి‌ఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ” బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఒక్క ఓటు వేసిన వేస్టే అని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తుందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో ఢిల్లీలో కూడా సత్తా చాటాలని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అని బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాలనపై తీవ్ర వ్యతిరేకత భావంతో ఉన్నారు. ఈ రెండు పార్టీల ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ పార్టీ.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిలా మారడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

Also Read:ఫైనల్ లో ఆసీస్.. టీమిండియాకు కష్టమే?

- Advertisement -