24న పవన్ ‘కాటమరాయుడు’

156
pawan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్  ‘కాటమరాయుడు’ సినిమా రిలీజ్ కి ముహూర్తం కుదిరింది. ఈ నెల 24న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు చెబుతు రిలీజ్ డేట్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఇటీవలె  సెన్సార్ పూర్తి చేసుకున్న కాటమరాయుడు క్లీన్ యూ సర్టిఫికేట్ పొందింది. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా.. గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందించాడు.

నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. టీజర్‌కు ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయిలో ఆన్‌లైన్‌లో వ్యూస్‌ దక్కాయి. దీంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా అందరూ చూసే చిత్రమని సెన్సార్‌ సభ్యులు మెచ్చుకోవడం గమనార్హం. అలాగే ప్రముఖ నిర్మాత, పవన్‌ సన్నిహితుడు బండ్ల గణేష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌ చాలా గొప్పగా వచ్చిందని, సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు.

కాగా, రిలీజైన పాటలు, టీజర్‌కు ఆదరణ దక్కడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 144 నిముషాల నిడిమి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈనెల 24న రిలీజ్‌ చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు.