అల్లుడి సినిమాలో పవన్‌..

274
Pawan Kalyan
- Advertisement -

పాలిటిక్స్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్.. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్తాడని అనుకున్నారంత. కానీ అటు పాలిటిక్స్‌..ఇటు సినిమా రెండింటినీ కూడా పవన్ బ్యాలెన్స్‌ చెయ్యగలడని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ పవన్‌కు పూర్తిగా రాజకీయాలేనా.. లేక సినిమాపై కూడా ఓ కన్నేస్తాడా..? అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఆ విషయం పై మాత్రం ఇప్పటి వరకూ సరైన క్లారిటీ లేదు.

Pawan Kalyan

ఇక అసలువిషయానికొస్తే…పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ మేకప్‌ వేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఈ విషయం గురించే ఫిల్మనగర్లో గుసగుసలు మొదలయ్యాయి. అజ్ఞాత‌వాసి తర్వాత..సినిమాలు ప్రకటించని పవన్‌ ..సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ సినిమాలో ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాక్‌. వైష్ణవ్‌ తేజ్‌ త్వరలో చిత్రసీమకి పరిచయమవబోతున్నాడని, ఈ క్ర‌మంలో ఆయ‌న న‌ట‌న‌తో పాటు వివిధ రంగాల‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో వైష్ణ‌వ్ తేజ్ చిత్రాన్ని ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’ చిత్రాల దర్శకుడు డాలి డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ని సమాచారం. ప‌వ‌న్ మేన‌ల్లుడు సినిమాని డైరెక్ట్ చేస్తున్న డాలికి ప‌వ‌న్‌తోను మంచి సాన్నిహిత్యం ఉన్నందున ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేయ‌మ‌ని ప‌వ‌ర్ స్టార్‌ని కోరాడ‌ట‌. మేన‌ల్లుడి కోసం ప‌వ‌న్ వారి అభ్య‌ర్ధ‌న‌ని అంగీక‌రించార‌ని తెలుస్తోంది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది.

- Advertisement -