ట్రెండింగ్‌లో కాటమరాయుడు సాంగ్

244
Katamarayudu Full Song With English Lyrics
- Advertisement -

కాటమరాయుడు టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్‌, మోషన్‌ పోస్టర్ దగ్గరి నుంచి హైప్ క్రియేట్ చేయగా ఇక ట్రైలర్‌తో అయితే టీ టౌన్ రికార్డులను తిరగరాశాడు పవన్‌. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఏ హీరోకు సోంతం కానీ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు పవన్‌. తాజాగా మిరా మిరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం .. కరా కరా కండల రోషం పోటెత్తుతాది జనం కోసం” అంటూ ఈ టైటిల్ సాంగ్ రిలీజ్ కాగా పవన్‌ తన సత్తాచాటాడు.  రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా .. అనూప్ రూబెన్స్ స్వరకల్పనలో అనురాగ్ కులకర్ణి ఈ పాట పాడాడు.

నిన్న సాయంత్రం ఫస్టు సాంగ్ గా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. విడుదలైన 5 గంటల్లోనే  యూట్యూబ్ లో 1మిలియన్ వ్యూస్ ను దాటేసి కొత్త రికార్డును సృష్టించింది. ఈ పాట 1.36 లక్షల లైక్స్ ను సాధించడం మరో విశేషం.  మొత్తానికి అంతా ఊహించినట్టుగానే ఈ సాంగ్ సంచలనానికి తెరతీసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. అనూప్ సంగీతం పవన్ రేంజ్ కి .. ఈ సినిమా టైటిల్ కి తగినట్టుగా ఉండటంతో, ఈ స్థాయి ఆదరణ లభిస్తోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఈ నెల 14న ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకుని .. 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://youtu.be/qmvkJjs2YEo

- Advertisement -