మహేశ్ బాబు – మురుగదాస్ కాంబినేషన్లో ఒక భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఇంతవరకూ ఫస్టులుక్ రాలేదు. టైటిల్ కూడా ఖరారు కాకపోవడం అభిమానుల్లో మరింత ఆతృతను పెంచుతోంది. సినిమాకు సంబంధించి ఒక్క వార్త కూడా లీక్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతోంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
మహేష్ మూవీపై అఫిషియల్ స్టేట్ మెంట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు టైటిల్ కూడా ఖరారు కానీ ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటివరకు రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఏజెంట్ శివ,మహేష్ 23,సంభవామితో పాటు రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ తాజాగా మరో టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ క్రమంలో తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అదే ‘మర్మం’! కథకు తగ్గట్టుగా ఈ ‘మర్మం’ అనే టైటిల్ సరిపోతుందని భావిస్తున్నారట. అయితే, మహేశ్ లాంటి మాస్ హీరో సినిమాకు ఇలాంటి క్లాస్ టైటిల్ ఎంతవరకు సూటవుతుందన్నది కూడా డౌటే! ఏమైనా, ఈ టైటిల్ సస్పెన్స్ త్వరలోనే తొలగిపోతుంది. కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను హైదరాబాదులో మహేశ్ బాబు బృందంపై చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తి కాగానే మరో భారీ షెడ్యూల్ కోసం యూనిట్ ముంబయ్ వెళ్లనుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్త లీక్ కాకపోయినా రిలీజ్ డేట్ మాత్రం ఫిక్సయిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా స్పందించిన దర్శకుడు మురుగదాస్ జూన్ 23న వస్తున్నామని తెలిపాడు. ఈ రిలీజ్ డేట్ వెనుక ఉన్న స్టోరీని కూడా ఆయన వెల్లడించాడు. ఇది మహేష్ 23వ సినిమా కావడంతో ఆరోజునే వస్తున్నట్లు ఆయన తెలిపిన సంగతి తెలిసిందే.

