మొక్కలు నాటిన ఇగ్నినైటింగ్ మైండ్స్ ఎడిటర్..

26
Karunakara Reddy

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కర్మన్ ఘాట్‌లోని తన కార్యాలయంలో ఇగ్నినైటింగ్ మైండ్స్ ఎడిటర్ కరుణాకర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పకృతిని కాపాడుతే అది మనల్ని రక్షిస్తుంది అని.. సందర్భం ఏదైనా మొక్కలు నాటే చైతన్యం ప్రజల్లో తీసుకొని రావాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు.