హరిత హోటల్‌ నిర్మాణానికి మంత్రి కొప్పుల భూమి పూజ..

24
Minister koppula eshwar

వెల్గటూర్ మండలం స్తంబంపెల్లి గ్రామం పరిధిలోని 1 ఎకరంలో రూ. 4కోట్ల 60లక్షలతో నిర్మించ తలపెట్టిన హరిత హోటల్‌ నిర్మాణానికి టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ధర్మపురి లక్ష్మి నరసింహా స్వామి దేవాలయం, కోటిలింగాల వంటి పుణ్య, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు, భక్తులు నిత్యం అధిక సంఖ్యలో వస్తున్నారని మంత్రి తెలిపారు.

కోటి లింగాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. అందులో భాగంగా కోటిలింగాల దేవస్థానంలో ట్రైబల్‌ టూరిజం ఆధ్వర్యంలో 2 కోట్లతో శాతకర్ణి, పూలోమావి రెండు బోట్లు పర్యటకుల కోసం నడుస్తున్నాయి. అలా 1 కోటి రూపాయలతో స్పీడ్ బోట్లు కూడా మంజూరు అయి రావలసి ఉన్నది. అనంతరం హరిత హోటల్ నమూనా మ్యాప్ పరిశీలించడం జరిగింది.