ఆర్‌ఎస్‌ఎస్‌పై మండిపడ్డ మాజీ సీఎం…

245
- Advertisement -

భారతదేశానికి స్వాతంత్ర్య పోరాటంలో ఏఒక్క ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అయినా ఉన్నారా అని ఆర్‌ఎస్ఎస్‌ను తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య. నవంబర్‌ 26 రాజ్యంగ దినోత్సవ ర్యాలీ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ ఆర్‌ఎస్ఎస్ పై విమర్శలు గుప్పించారు. దేశం కోసం ఆర్ఎస్ఎస్ చేసింది ఏమీ లేదని అన్నారు.

స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త పేరు మీరు చెప్పగలరా? బ్రిటిషర్లకు ఆర్ఎస్ఎస్ సహాయంగా పని చేసిందని చెప్పడానికి ఇంత కంటే ఉదహారణ అక్కర్లేదు. ఇలాంటి ఉదహారణలు అనేకం ఉన్నాయి. మనల్ని వెనక్కి నెట్టేయడానికి ఇద్దరు కలిసే పని చేశారు అని అన్నారు.

బీజేపీ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకమని పేదలను అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏనాడూ కృషి చేయలేదని అన్నారు. సామాజిక న్యాయానికి బీజేపీ ఎప్పుడూ అనుకూలంగా లేదని…ఇంతకు ముందెప్పుడూ లేదని…భవిష్యత్తులోనూ ఉండదని అన్నారు.

ఇవి కూడా చదవండి…

మీసం మెలేసిన రాహుల్‌…

త్వరలో విమాన రెస్టారెంట్‌@హైదరాబాద్‌

టిఫా స్కానింగ్‌తో ఆరోగ్య తెలంగాణ

- Advertisement -