తెలంగాణ ఆడిట్ విధానం దేశానికి ఆదర్శం..

454
Martineni Venkateswara Rao
- Advertisement -

రాష్ట్ర ఆడిట్ శాఖ డైరెక్టరేట్​ కార్యాలయంలో సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావుతో కర్నాటక ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల బృందంలో బీదర్ స్టేట్ ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ వి.శ్రీకాంత్, బెంగుళూర్ ఆడిట్ అధికారి శివరాజ్ కుమార్, పంచాయితీ రాజ్ సీనియర్ ప్రంగ్రామర్ గిరీష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడిట్, కర్నాటక బృందంతో సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో గత రెండు నెలలు గా నిర్వహించిన ఆడిట్ ఆన్​ లైన్​ విధానాన్ని కర్నాటక బృందానికి వివరించారు.

అలాగే పవర్ పాయింట్ ద్వార ఆన్​ లైన్‌లో ఆడిట్ విధానాన్ని డిప్యూటీ డైరెక్టర్ రాము వివరించారు. గ్రామ పంచాయితీ లను ఆన్​ లైన్​ ఆడిట్ కి ఎంపిక నుంచి ఆడిట్ చెయ్యడం, అభ్యంతరాలు నమోదు , ఆడిట్ నివేదికలు గ్రామపంచాయతీ లకు పంపే వరకు తీసుకున్న ప్రతి చర్యని కర్నాటక బృందానికి తెలంగాణ ఆడిట్ అధికారులు వివరించారు.

తెలంగాణ లో మొత్తం 12,769 గ్రామపంచాయతీ లకు గాను 3,225( 25%) గ్రామపంచాయతీలు ఆడిట్ ఆన్​ లైన్​ కి ఎంపిక చేసి ఆడిట్ అయ్యేలా ప్రణాళిక ప్రకారం ప్రతిరోజు సంచాలకులు రివ్యు చేసిన విధానం వారికి వివరించారు. కర్నాటక బృందం సందేహాలను నివృతి చేస్తూ తెలంగాణలో ఆన్​ లైన్​ ఆడిట్ లో ఎదురైనా సవాళ్ళను వాటిని అధిగమించిన తీరుని వివరించడం జరిగింది. తెలంగాణ ఆడిట్ నివేదికలను కర్నాటక బృందంకి చూపించి వివరించారు.

కర్నాటక బృందంలోని బీదర్ స్టేట్ ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ వి.శ్రీకాంత్ మాట్లాడుతూ దేశంలో గొప్పగా తెలంగాణ ఆడిట్ విధానం ఉందని అన్నారు. పవర్ పాయింట్ లో చెప్పిన ఆడిట్ విధానం అధ్బుతం, కర్నాటకలో అమలుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణా రాష్ట్ర ఆడిట్ శాఖ జాయింట్ డైరెక్టర్లు ద్రాక్షయని, ఇందిర, డిప్యూటీ డైరెక్టర్లు రేవతి, రాము, వెంకట్, ఏవో వెంకటేశం కర్నాటక బృందం సభ్యులు తదితరులు ఉన్నారు

- Advertisement -