ఎమ్మెల్సీ కవితకు అభినందనల వెల్లువ..

164
mlc kavitha

ఉమ్మడి ‌నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా రికార్డు విజయం సాధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిబిజికేఎస్, పీఆర్టీయూ నేతలు కలిసి‌ శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రులు పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కలిసి అభినందనలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నిజామాబాద్ జిల్లా ప్రజల్లో కవిత పట్ల ఉన్న ఆదరణ ఇంతటి ఘనవిజయాన్ని అందించాయని మంత్రులు తెలిపారు.

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ లు గొంగడి సునీత, అరికెపూడి ‌గాంధీ, ఎమ్మెల్యేలు ‌జోగు రామన్న, దాసరి మనోహర్ రెడ్డి, ఛల్లా ధర్మారెడ్డి, కల్వకుంట్ల విద్యా సాగర్ రావు, వనామ వెంకటేశ్వరరావు, అబ్రహం, బండ్ల‌ కృష్ణ మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, సుంకె రవిశంకర్, జోగు రామన్న ఎమ్మెల్సీ కవితకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కే.జనార్థన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పీఆర్టీయూ నాయకులు పూల రవీందర్, టిబిజికేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.