బిగ్ బాస్ టాస్కుతో హారిక కంటతడి..!

357
Dethadi Harika

బిగ్ బాస్ సీజన్ 4 తగ సోమవారంతో 37వ ఎపిసోడ్‌‌లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ షో హౌస్‌లో టాస్కులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కంటెస్టెంట్లు.. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన ఓ టాస్కులో భాగంగా హారిక కన్నీరు పెట్టుకుంది.. ఇచ్చిన మాట తప్పానంటూ కెమెరా ముందు ఏడ్చేసింది. అసలు విషయం ఏంటంటే.. ఒక్కోసారి బిగ్ బాస్ టాస్కులు చాలా కఠినంగా ఉంటాయి. అందులో కొన్ని ఎవరికీ యిష్టం ఉండదు కూడా.. కానీ అలాంటివి చేయక తప్పదు. ఇప్పుడు హారిక కూడా ఇలాంటిదే చేసింది.

తాజాగా ఇచ్చిన టాస్కులో భాగంగా కొందరికి కొన్ని డీల్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎప్పట్లాగే ఉన్న సభ్యులను రెండు టీమ్స్‌గా విడగొట్టిన బిగ్ బాస్.. వాళ్లకు డీల్స్ ఇచ్చాడు.ఈ టాస్కులో భాగంగానే అఖిల్ టీంలోని ఓ అమ్మాయి మెడపై వరకు కూడా జుట్టు కత్తిరించుకోవాలంటూ షరతు పెట్టాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి స్టార్ మా రిలీజ్ చేసింది.

#BiggBoss tho housemates deal 👍 or no deal 👎 #BiggBossTelugu4 Today at 9:30 PM on #StarMaa