వెల్లివిరిసిన మతసామరస్యం..

132
karnataka
- Advertisement -

వినాయకచవితి సందర్భంగా కర్ణాటకలో మతసామరస్యం వెల్లివిరిసింది. హిజబ్‌ వంటి వివాదాలు తలెత్తినా చోట తామంత ఒక్కటేనని నిరూపించారు. మాండ్యా జిల్లాలో జరిగిన గణనాథుని పూజలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

విఘ్నాల అధిపతికి పూజలు చేశారు. పదిరోజులపాటు జరుగనున్న ఈ వేడుకల్లో తాము కూడా పాలుపంచుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

ఇక హుబ్బళ్లి-ధర్వాడ్‌లో ఉన్న ఈద్గా మైదానంలో గణేశ్‌ చతుర్థి ఉత్సవాలకు కర్ణాటక హైకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. అంజుమన్‌-ఈ-ఇస్లామ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఈద్గా మైదానంలో వినాయక చవితి జరుపుకోవచ్చని న్యాయస్థానం తెలపడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు.

- Advertisement -