బీజేపీతో కలిసి పనిచేస్తాం:కుమారస్వామి

47
- Advertisement -

కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీతో కలిసి పనిచేస్తామన్నారు జేడీఎస్ చీఫ్, మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. దీంతో ఆయన ఎన్డీఏలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారుతారని భావించిన జేడీఎస్ మాత్రం అనుకున్న స్థానాలను దక్కించుకోలేదు. దీంతో ప్రతిపక్ష స్థానానికే పరిమితమయ్యారు కుమారస్వామి.

ఇక కొంతకాలంగా ఆయన పార్టీ ఎన్డీఏలో చేరడం ఖాయమే అని ప్రచారం జరిగినా ఆయన స్పందించలేదు. అయితే తాజాగా తాము బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలుపుతామని…పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకునే అధికారాన్ని పార్టీ అధినేత దేవెగౌడ తనకు ఇచ్చారని తెలిపారు.

Also Read:మహాకవి దాశరథి: హరీశ్‌ రావు

ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కు 135, బీజేపీకి 65, జేడీఎస్ కు 19 స్థానాలు ఉన్నాయి.

Also Read:వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం:సీఎం కేసీఆర్

- Advertisement -