తగ్గిన ఎల్పీజీ సిలిండర్‌ ధర..

254
lpg
- Advertisement -

వినియోగదారులకు గుడ్ న్యూస్..గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి చమురు సంస్థలు. అయితే ఇది వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌ పై మాత్రమే. 19 కేజీల సిలిండర్‌పై రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. హైదరాబాద్‌లో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2099.5కు తగ్గింది. కాగా, గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.1976.07గా ఉన్న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1885గా ఉండగా ముంబైలో రూ.1844, కోల్‌కతాలో 1995.50, చెన్నైలో రూ.2045కు చేరాయి.

గ్యాస్‌ ధరలు భారీగా పెరడగంతో మే నెలలో రూ.2354 రికార్డు స్థాయికి చేరాయి.

- Advertisement -