రాజీనామా చేసే ప్రసక్తేలేదు: కర్ణాటక సీఎం

85
yedi

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాకు రంగం సిద్ధమైనట్లు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటి అయ్యారు.

రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంపై చర్చించేందుకే తాను ఢిల్లీ వచ్చానని స్పష్టం చేశారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తనపై మంచి అభిప్రాయం ఉందని..తాను పార్టీ కోసం పనిచేస్తున్నా.. రాష్ట్రంలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని తెలిపారు.

సీఎంను మార్చాలని గత కొన్నిరోజులుగా అధిష్టానంపై కర్ణాటక బిజెపిలోని యడ్యూరప్ప వ్యతిరేక వర్గం ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.