ప్రేమలో కాంతార దర్శకుడు!

92
rishab-shetty
- Advertisement -

కాంతార సినిమా బాక్సాఫీస్‌ వద్ద సెన్సెషన్ క్రియేట్‌ చేసింది. కన్నడ టాలెంట్‌డ్‌ దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా కలెక్షన్ల వర్షంను కురిపిస్తుంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా కాంతార 360కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లో సునామీ సృష్టించింది.

ఈ సినిమాతో హీరో రిషబ్ శెట్టి డైరెక్టర్‌గా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక తాజాగా రిషబ్ శెట్టికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఓ హీరోయిన్‌తో రిషబ్ లవ్ ట్రాక్ నడిపినట్లు టాక్. టాలీవుడ్ హీరోయిన్ హరిప్రియతో రిషబ్ శెట్టి ప్రేమాయణం నడిపారని..వీరిద్దరూ కలిసి రిక్కీ అనే సినిమా చేశారు. అయితే తర్వాత ఏమైందో తెలియదు కానీ విడిపోయారని టాక్.

వీరి బ్రేకప్ తర్వాత తన స్నేహితురాలు ప్రగతి శెట్టిని పెళ్లి చేసుకున్నారు రిషబ్. ఇక త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి రిషబ్ శెట్టి ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. వీరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే రిషబ్.. ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -