అలర్ట్..చైనాలో మళ్లీ కరోనా మరణం

251
covid
- Advertisement -

మళ్లీ కరోనా పంజా విసరడానికి రెడీ అవుతోంది. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో దాదాపు 6 నెలల తర్వాత తొలి కరోనా మరణం సంభవించింది. బీజింగ్‌కు చెందిన ఓ 87ఏళ్ల వృద్ధుడు తాజాగా కొవిడ్‌తో చనిపోయినట్లు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది.ఈ ఏడాది మే 26న షాంఘైకు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో ప్రాణాలు కొల్పోగా తర్వాత మళ్లీ ఇప్పుడే మరో వ్యక్తి వైరస్ కారణంగా చనిపోయారు.

చైనాలో దాదాపు 92 శాతం మంది కనీసం ఒక్కడోసు కరోనా టీకా తీసుకున్నారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు జీరో కోవిడ్ పాలసీ పేరిట కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది చైనా. ఇప్పటివరకు 2,86,197 కరోనా కేసులు నమోదుకాగా 2,60,141 మంది కోలుకున్నారు. కొవిడ్‌ కఠిన ఆంక్షల కారణంగా ఝెంగ్‌జువాలో ఇటీవల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా అక్కడి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -