బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి విషాదం తాలుకు ప్రభావం నుంచి బయటపడేందుకు సినీ ప్రేమికులకు కొంత సమయం పట్టేలా ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఈ వార్త వచ్చినప్పటి నుంచి నివాళుల పర్వం కొనసాగుతూనే ఉంది. తనతో గతంలో పనిచేసిన సీనియర్ స్టార్స్ తో పాటు ఇప్పుడున్న యంగ్ జెనరేషన్ నటీనటులకు స్పూర్తిగా నిలిచిన శ్రీదేవి జ్ఞాపకాల నుంచి బయటికి రావడం ఎవరి వల్లా కావడం లేదు.
క్వీన్ కంగనా రౌనత్ మాత్రం దీనిని చాలా పర్సనల్ గా తీసుకుంది. గతంలో పలు ఇంటర్వ్యూలలో శ్రీదేవి నటన – డాన్స్ చూసే తాను మెలకువలు నేర్చుకున్నానని చెప్పిన కంగనా ఇప్పుడు తన ఆరాధ్యురాలు లేరు అనే వార్తను డైజెస్ట్ చేసుకోలేక తీవ్ర దుఃఖంతో జ్వరం తెచ్చుకుని అనారోగ్యం పాలైనట్టు సమాచారం.
ఈ అమ్మడు ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత నేపథ్యంలో మణికర్ణిక అనే సినిమా చేస్తున్న కంగనా, అనారోగ్యం కారణంగా షూటింగ్‌కి కూడా వెళ్ళడం లేదట. దీంతో కొన్నాళ్ళు షూటింగ్ వాయిదా వేసినట్టు తెలుస్తుంది. క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక చిత్రం తెరకెక్కుతుండగా, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి కథ అందిస్తున్నాడు.