కేరళ సీఎంకు కమల్‌ సెల్యూట్

223
- Advertisement -

సినీనటుడు కమల్‌ హాసన్‌ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ప్రశంసించారు. ట్రావెన్కోర్‌ దేవస్వామ్‌ బోర్డులో(టీడీబీ) దేవాలయాల్లో సేవలు అందించడానికి బ్రహ్మణేతరులను పూజారులుగా నియమించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 62 మంది పూజారులను నియమించగా…. వీరిలో 36 మంది బ్రాహ్మణేతరులు ఉన్నారు. వీరిలో ఆరుగురు దళితులు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ ద్వారా స్పందించిన కమల్‌…పెరియన్ కల నిజమైంది అంటూ ట్వీట్ చేశారు. టీడీబీ చాలా గొప్పది. 36 మంది బ్రాహ్మణేతర పూజారులను నియమించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి సెల్యూట్ అంటూ కొనియాడారు.  తమిళనాడుకు చెందిన డీఎంకే నేత స్టాలిన్‌, ఎండీఎంకే నేత వైగో సైతం బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించడంపై కేరళ ప్రభుత్వాన్ని అభినందించారు. ఇది ఓ చారిత్రక నిర్ణయమని అన్నారు.

Kamal praises Kerala CM
దళితులను పూజారులుగా నియమించాలని నిర్ణ‌యం తీసుకోవ‌డం కేరళలో ఇదే తొలిసారి. టీడీబీ ఆధ్వర్యంలో మొత్తం 1,248 దేవాలయాలు ఉన్నాయి.  ఆలయ పూజారుల నియామ‌కాల కోసం ఇప్ప‌టికే రాత పరీక్ష, ఇంటర్వ్యూలను పూర్తిచేశారు. శబరిమల అలయంలో దళితులను పూజారులుగా నియమించాలనే పిటిషన్ హైకోర్టులో ఉందని, ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్రాహ్మణులను మాత్రమే నియమిస్తున్నామని బోర్డు సభ్యులు తెలిపారు.

- Advertisement -