లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన సినిమా విశ్వరూపం. ఈమూవీకి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకు సిక్వేల్ గా విశ్వరూపం 2 చిత్రాన్ని తెరకెక్కించారు. విశ్వరూపం 2 మూవీకి కూడా కమల్ హాసన్ దర్శకత్వం వహించారు. ఆండ్రియా, పూజా కుమార్ లు హీరోయిన్లుగా నటించిచారు. తెలుగు, హిందీ, తమిళ్ మూడు భాషల్లో విడదుల చేయనున్నారు.
ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ఎస్. చంద్రహాసన్, కమల్ హాసన్ నిర్మాతలుగా వ్యవహరించగా..జిబ్రాన్ సంగీతం అందించారు. ఈసందర్భంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో కమల్ హాసన్, హీరోయిన్లు ఆండ్రియా, పూజా కుమార్, సంగీత దర్శకుడు జిబ్రాన్, ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్ర్తీ పలువురు పాల్గోన్నారు.
తాను తినే తిండి, వేసుకునే బట్టలు నాకు అన్ని ప్రేక్షకులు ఇచ్చినవే అన్నారు లోక నాయకుడు కమల్ హాసన్. ప్రేక్షకుల రుణం తీసుకొవాలనుకుంటున్నానని చెప్పారు. కమల్ హాసన్ అనే మనిషిని ప్రేక్షకులే తయారు చేశారన్నారు. తెలుగు ప్రేక్షకులంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు.